మోదీని చూసి చంద్రబాబు భయపడుతున్నారనేది పెద్ద జోక్: యనమల

  • వైసీపీ, జనసేన, బీజేపీలు గేమ్ ఆడుతున్నాయి
  • చంద్రబాబును రాజీనామా చేయాలి అనడం గేమ్ ప్లాన్ లో భాగమే
  • 12 ఛార్జ్ షీట్లలో నిందితుడు జగనే మోదీని చూసి భయపడాలి
వైసీపీ, జనసేన, బీజేపీలపై ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరడం... ఈ మూడు పార్టీల గేమ్ ప్లాన్ లో భాగమని చెప్పారు. ఏపీ ప్రయోజనాల కోసం పోరాటం చేస్తున్న ముఖ్యమంత్రిని రాజీనామా చేయాలంటరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీని ఎలా ఓడించాలా అనేదే జగన్, పవన్ కల్యాణ్ ఆలోచన అని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ డైరెక్షన్ లోనే వీరిద్దరూ పని చేస్తున్నారని ఆరోపించారు. మోదీని చూసి చంద్రబాబు భయపడుతున్నారంటూ చేస్తున్న విమర్శలు పెద్ద జోక్ అని అన్నారు. 12 ఛార్జ్ షీట్లలో నిందితుడైన జగనే మోదీని చూసి భయపడాలని చెప్పారు. 
Go Back to Shorts
Yanamala
Chandrababu
Jagan
Pawan Kalyan

More Telugu News