సెన్సార్ పూర్తి చేసుకున్న 'విజేత'
- కల్యాణ్ దేవ్ హీరోగా 'విజేత'
- కథానాయికగా మాళవిక నాయర్
- ఈ నెల 12వ తేదీన రిలీజ్
ఈ సినిమాలో కల్యాణ్ దేవ్ సరసన కథానాయికగా మాళవిక నాయర్ నటించింది. వారాహి చలన చిత్రం బ్యానర్లో తండ్రీకొడుకుల అనుబంధానికి అద్దంపట్టే కాన్సెప్ట్ తో ఈ సినిమా నిర్మితమైంది. కల్యాణ్ దేవ్ తండ్రి పాత్రలో మురళీ శర్మ కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ కి .. ట్రైలర్ కి అనూహ్యమైన స్పందన వచ్చింది. దాంతో ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకంతో కల్యాణ్ దేవ్ వున్నాడు. ఆయన నమ్మకం నిజమవుతుందేమో చూడాలి మరి.