Viral Videos: మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన యువకులు.. వీడియో వైరల్‌

షార్ట్స్‌లో చూడండి
ఓ మహిళ పట్ల ముగ్గురు యువకులు అసభ్యకరంగా ప్రవర్తించి వేధించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావోలో చోటుచేసుకుంది. ఆమె భయపడుతూ తనను వదిలేయాలని వేడుకుంటున్నా ఆ యువకులు వేధింపులకు గురిచేయడమే కాకుండా స్మార్ట్‌ ఫోన్‌లో ఆ దృశ్యాలను చిత్రీకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు.

వారి పేర్లు రాహుల్, ఆకాశ్‌ అని చెప్పారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తన ఇంట్లో ఉన్న ఆ మహిళను వారు బలవంతంగా లాక్కెళ్లి ఈ చర్యకు పాల్పడ్డారని చెప్పారు. ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయలేదని పోలీసులు పేర్కొన్నారు.                                             
Go Back to Shorts
Viral Videos
women
Uttar Pradesh

More Telugu News