థ్రిల్లర్ మూవీ నుంచి కల్యాణ్ రామ్ ఫస్టులుక్
- దర్శకుడిగా గుహన్
- థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ
- త్వరలోనే పూర్తి వివరాలు
కల్యాణ్ రామ్ ఈ పోస్టర్ లో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు .. మరింత హ్యాండ్సమ్ గా అనిపిస్తున్నాడు. ఉత్కంఠభరితమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందనుందట. అనూహ్యమైన మలుపులతో ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుందని చెబుతున్నారు. కల్యాణ్ రామ్ కెరియర్లోనే ఇది చెప్పుకోదగిన సినిమా అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం కథానాయిక కోసం అన్వేషణ కొనసాగుతోంది. మిగతా నటీనటులు .. సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.