రైతు రుణ మాఫీ ప్రకటించిన కుమారస్వామి.. షరతులు వర్తిస్తాయ్!
- రూ. 34 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేయనున్నాం
- రూ. 2 లక్షల లోపు రుణాలు మాఫీ
- రుణాలు చెల్లించిన వారి అకౌంట్లలోకి రూ. 25 వేలు
సకాలంలో రుణాలను చెల్లించిన రైతుల అకౌంట్లలోకి రూ. 25 వేల చొప్పున జమ చేస్తామని తెలిపారు. రూ. 2 లక్షల లోపు ఉన్న రైతు రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు. కొందరు రైతులు రూ. 40 లక్షల వరకు రుణాలు తీసుకున్నారని... అంత మొత్తంలో రుణమాఫీ చేయడం సబబు కాదు కాబట్టి... రూ. 2 లక్షల లోపు ఉన్న రుణాలను మాఫీ చేయనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న కుటుంబాలకు, సహకార రంగంలో సొంత భూములను కలిగి ఉన్న రైతులకు రుణమాఫీ వర్తించదని చెప్పారు. గత మూడేళ్ల నుంచి ఆదాయపు పన్ను చెల్లించిన రైతులు కూడా రుణమాఫీకి అనర్హులని తెలిపారు.