'మాన్ సూన్ హంగామా'... పాత జియో ఫోన్, రూ. 501 ఇస్తే కొత్త ఫోన్: ముఖేష్ అంబానీ

  • కొత్త ఆఫర్ ను ప్రకటించిన ముఖేష్ అంబానీ
  • ఫీచర్ ఫోన్ ధర రూ. 1,500 నుంచి రూ. 501కి తగ్గింపు
  • త్వరలో మార్కెట్లోకి 'జియో ఫోన్ 2'
'మాన్ సూన్ హంగామా' పేరిట ఓ సరికొత్త ఆఫర్ ను ప్రకటించారు ముఖేష్ అంబానీ. జియో ఫోన్ ను వాడుతున్న వారు, ఆ ఫోన్ ను తిరిగి ఇచ్చి కొత్త ఫోన్ తీసుకోవచ్చని తెలిపారు. జూలై 21 నుంచి ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని, ఫోన్ తో పాటు రూ. 501 చెల్లించాలని చెప్పారు. జియో ఫీచర్ ఫోన్ ధరను రూ. 1,500 నుంచి రూ. 501కి తగ్గిస్తున్నట్టు చెప్పారు.

'జియో ఫోన్ 2' ను ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి తెస్తామని, దీని ధర రూ. 2,999గా ఉంటుందని అన్నారు. క్వయిట్రీ కీ బోర్డు, డ్యూయల్ సిమ్, 2.4 అంగుళాల స్క్రీన్ 128 జీబీ వరకూ ఎస్డీ కార్డు సపోర్టు, రెండు కెమెరాలు, 512 ఎంబీ రామ్, 4 జీబీ రామ్, వైఫై దీని ప్రత్యేకతలని వెల్లడించారు. అతి త్వరలోనే ఈ కొత్త ఆఫర్ల గురించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తామని అన్నారు. ప్రస్తుతం జియో గిగా ఫైబర్ ట్రయల్స్ నడుస్తున్నాయని, ఆగస్టు 15 నుంచి 'మై జియో', 'జియో డాట్ కామ్'లో రిజిస్టర్ చేసుకున్న వారికి హై స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ సేవలను దగ్గర చేస్తామని అన్నారు. అత్యధిక రిజిస్ట్రేషన్లు వచ్చిన ప్రాంతానికి తొలి సేవలు అందుతాయని వెల్లడించారు.
Go Back to Shorts
India
Jio
Mukesh Ambani

More Telugu News