రష్యా యువజంట కాపురంలో నిప్పులు పోసిన 'మెస్సీ -రొనాల్డో'!
- 2002 ఫుట్ బాల్ వరల్డ్ కప్ సందర్భంగా కలసిన జంట
- ప్రేమ వివాహం చేసుకుని 18 ఏళ్లు కాపురం
- రొనాల్డో, మెస్సీల్లో ఎవరు గొప్పంటూ వాగ్వాదం
- విడాకులకు దరఖాస్తు
రొనాల్డో వీరాభిమాని అయిన భార్య, మెస్సీకి అభిమాని అయిన భర్తల మధ్య ఎవరు గొప్పన్న విషయంలో విభేదాలు వచ్చాయి. మెస్సీకన్నా రొనాల్డో గ్రేట్ అని భార్య, కాదు మెస్సీనే గ్రేట్ అంటూ భర్త వాదులాడుకున్నారు. పెనాల్టీ లభించినా స్కోర్ చేయని మెస్సీ ఏం ఆటగాడని ఆమె చేసే విమర్శలతో నిగ్రహించుకోలేకపోయిన భర్త, ఇంట్లో నుంచి బయటకు వచ్చి, ఆ మరుసటి రోజే ఓజే చెలియాబిన్స్క్ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు.