ప్రయాణికుల ఒత్తిడితో దిగొచ్చిన ఎమిరేట్స్.. హిందూ భోజనానికి ఓకే!
- ఎయిర్‌లైన్స్ మెను నుంచి హిందూ భోజనం తొలగింపు
- దుమ్మెత్తి పోసిన నెటిజన్లు
- నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న ఎమిరేట్స్
భారత్‌లో అతిపెద్ద విదేశీ విమానయాన సంస్థ అయిన ఎమిరేట్స్ అంతకుముందు విమాన మెనులోంచి హిందూ భోజనాన్ని తొలగిస్తున్నట్టు ప్రకటించి షాకిచ్చింది. దీంతో హిందువుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తమ కస్టమర్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు బుధవారం సాయంత్రం ఎయిర్‌లైన్స్ ప్రకటించింది.