ఆగస్టు 12 నుంచి 5 రోజుల పాటు తిరుమల ఆలయంలో స్వామి దర్శనం పూర్తిగా నిలిపివేత!
- 5 రోజుల పాటు మహా సంప్రోక్షణ
- గర్భాలయం, ఆనందనిలయంలో పలు క్రతువులు
- భక్తులను ముందే అప్రమత్తం చేయాలని టీటీడీ ఆలోచన
- 24న తుది నిర్ణయం తీసుకోనున్న ధర్మకర్తల మండలి
ఇక ఈ సంవత్సరం అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణ సెలవుల్లో రావడంతో, భారీగా భక్తులు వస్తే వారు ఇబ్బందులు పడతారన్న ఉద్దేశంతో దర్శనాన్ని పూర్తి స్థాయిలో నిలిపివేయాలని భావిస్తోంది. ఈ మేరకు భక్తులు తిరుమలకు వచ్చి నిరాశతో వెళ్లే బదులు, ముందే అప్రమత్తం చేయాలని అనుకుంటోంది. ఇప్పటికే ఆ ఐదు రోజుల్లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను, ఆర్జిత సేవా టికెట్లనూ టీటీడీ జారీ చేయలేదు. స్వామి దర్శనం పూర్తిగా నిలిపివేయాలన్న విషయమై తుది నిర్ణయాన్ని 24వ తేదీన జరిగే ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకోనున్నట్టు అధికారులు వెల్లడించారు.