కోడలు స్టూళ్లు తీసుకొస్తే.. పిల్లలు వైర్లు తీసుకొచ్చారు.. బురారీ ఆత్మహత్యల కేసులో కొత్త విషయం
- చనిపోవడానికి ముందు బయటి నుంచి స్టూళ్లు తెచ్చిన కోడలు
- ప్లైవుడ్ షాపు నుంచి వైర్లు తెచ్చిన టీనేజర్లు
- ఎదురింటిలోని సీసీ కెమెరాలో రికార్డు
తాజాగా ఈ కేసులో మరో విషయం వెలుగులోకి వచ్చింది. భాటియా ఇంటికి ఎదురుగా ఉన్న ఇంటిలోని సీసీటీవీలో రికార్డు అయిన ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో.. భాటియా కుటుంబ పెద్ద కోడలు రాత్రి పది గంటల సమయంలో బయటి నుంచి ఇంట్లోకి ప్లాస్టిక్ స్టూళ్లు తీసుకెళ్లడం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ తర్వాత 20 నిమిషాలకు టీనేజర్లు ఇద్దరు పూజ కోసం ప్లైవుడ్ షాపు నుంచి వైర్లు తీసుకొచ్చారు. మరో ఫుటేజీలో ఉదయం 7:14 గంటలకు ఓ వ్యక్తి భవనం పైకి వెళ్లి, తిరిగి 35 సెకన్లలోనే కిందికి రావడం కనిపించింది. పోలీసుల దర్యాప్తులో ఇప్పుడీ ఫుటేజీలు కీలకం కానున్నాయి.