సినిమాలపై విద్యార్థి ప్రశ్నకు ఆర్మీ చీఫ్ ఆసక్తికర సమాధానం!
- ఛత్తీస్ గఢ్ కు చెందిన విద్యార్థులతో బిపిన్ రావత్ మమేకం
- ‘దేశభక్తి సినిమాల గురించి మీ అభిప్రాయం?’ ఏంటన్న ఓ విద్యార్థి
- తాను సినిమాలు చూసి ముప్పై ఏళ్లు అయిందన్న రావత్
ఈ సందర్భంగా ఆర్మీ గురించిన విశేషాలు, జమ్మూకశ్మీర్ లో ప్రస్తుత పరిస్థితుల గురించి విద్యార్థులకు ఆయన వివరించారు. అంతేకాకుండా, చదువు, గెలుపోటములు, జీవితం తదితర అంశాల గురించీ ఆయన ప్రస్తావించారు. జీవితంలో అయినా, చదువులో అయినా ఓటమి సహజమని, అయితే, ఎన్ని ఓటములు ఎదురైనా వెనుకడుగు వేయకూడదని, ఎప్పుడూ నమ్మకం కోల్పోకూడదని విద్యార్థులకు చెప్పారు.
‘మీరు దేశ భవిష్యత్ కు ఆశా కిరణాలు.. కష్టపడండి.. విజయానికి కఠోర శ్రమే కీలకం’ అని వారికి రావత్ సూచించారు. కాగా, ఛత్తీస్ గఢ్ కు చెందిన ఇరవై మంది విద్యార్థులు వారం రోజుల పాటు ఉత్తర భారతదేశ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా వారు ఢిల్లీలో ఆయనను కలిశారు.