gold: పెరిగిన బంగారం ధర.. తగ్గిన వెండి ధర
బులియన్ మార్కెట్‌లో ఈరోజు బంగారం ధర పెరిగింది. పది గ్రాముల పసిడి ధర రూ.210 పెరిగి రూ.31,570గా నమోదయింది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడంతో కొనుగోళ్లు పెరిగాయని విశ్లేషకులు పేర్కొన్నారు. మరోవైపు, పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీ దారుల నుంచి కొనుగోళ్లు తగ్గడంతో ఈరోజు వెండి ధర తగ్గింది. కిలో వెండి ధర రూ.400 తగ్గి రూ.39,910గా నమోదయింది. కాగా, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 0.32 శాతం పెరిగి 1256.30 డాలర్లుగా నమోదయింది.