23 ఏళ్ల చిరుత ‘దీప’ పరిస్థితి విషమం.. ఆందోళనలో జూ అధికారులు!
- జూలో ఒక్కొక్కటిగా ప్రాణాలు విడుస్తున్న జంతువులు
- మొన్న ఏనుగు.. నిన్న సింహం
- నేడు చిరుత పరిస్థితి విషమం
చిరుత పులుల జీవిత కాలం 18 ఏళ్లే కాగా, దీప వయసు 22 దాటింది. వృద్ధాప్యం కారణంగానే అనారోగ్యానికి గురైంది. వైద్య చికిత్సకు చిరుత స్పందించకపోవడంతో దానితో అనుబంధాన్ని పెనవేసుకున్న సిబ్బంది విషాదంలో మునిగిపోయారు. ఇటీవలే 44 ఏళ్ల జమున అనే ఏనుగు ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా మరణించింది. 15 ఏళ్ల ఆసియాటిక్ సింహం క్రేజీ జూన్ 28 చనిపోయింది. ఇప్పుడు దీప పరిస్థితి విషమంగా ఉండడం అధికారులనే కాదు.. నగర వాసులను, జంతు ప్రేమికులను ఆవేదనకు గురిచేస్తోంది.