Andhra Pradesh: ఈ నెల 9 నుంచి ఏపీలో పర్యటించనున్న ఊమెన్ చాందీ

షార్ట్స్‌లో చూడండి
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఏపీ కాంగ్రెస్ కమిటీ వ్యవహారాల ఇంఛార్జి ఊమెన్ చాందీ ఈ నెల 9 నుంచి 31 వరకు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజా ఓ ప్రకటనలో తెలిపారు. తొలి విడత పర్యటనలో భాగంగా ఈ నెల 9 నుంచి 12 వరకు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్నారు.

 16వ తేదీ నుంచి 19 వరకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం రూరల్, విశాఖపట్టణం సిటీలో, 23వ తేదీ నుంచి 26 వరకు అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో, 30వ తేదీన తూర్పు గోదావరి, 31న పశ్చిమగోదావరి జిల్లాలలో పర్యటిస్తారని రాజా పేర్కొన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయా జిల్లాల కార్యకర్తల సమావేశాలు, నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Congress
oomen chandi

More Telugu News