అమెరికాలో జలపాతంలో పడి మృతి చెందిన తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్
- పదేళ్ల క్రితం ఉన్నత చదువులకు అమెరికా వెళ్లిన నాగార్జున
- అక్కడే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉద్యోగం
- మరణవార్తతో విషాదంలో మునిగిపోయిన కుటుంబసభ్యులు
ఉన్నత చదువుల కోసం పదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లిన నాగార్జున... అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. అతని సోదరుడు యశ్వంత్ హైదరాబాదులో పని చేస్తున్నారు. చెల్లెలు పూజిత పెళ్లి చేసుకుని, విజయవాడలో నివాసం ఉంటున్నారు. తల్లి రాజేశ్వరి పూజిత వద్దే ఉంటున్నారు. నాగార్జున తండ్రి 7 సంవత్సరాల క్రితం మరణించారు.