పాకిస్తాన్ న్యూస్ చానల్ లో న్యూస్ యాంకర్ గా సిక్కు యువకుడు!
- హర్మీత్ సింగ్ ను నియమించుకున్న ఊర్దూ చానల్ పబ్లిక్ న్యూస్
- మైనారిటీలకు పాక్ లో రక్షణ లేదనడం తప్పుగా పేర్కొన్న హర్మీత్
- ఇతరుల మాదిరిగానే పాక్ లో మైనారిటీలు జీవిస్తున్నారని ప్రకటన
పాకిస్తాన్ లో మైనారిటీలైన సిక్కులను అక్కడి వేర్పాటు వాద సంస్థలు లక్ష్యంగా చేసుకుని హత్యలకు పాల్పడుతున్నాయనే విమర్శలు ఇటీవల పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ తరహా దురభిప్రాయాలకు తాను ముగింపు పలకాలని అనుకుంటున్నట్టు హర్మీత్ సింగ్ పేర్కొన్నారు. మైనారిటీలకు పాకిస్తాన్ లో రక్షణ లేదన్న అభిప్రాయం తప్పు అని చెప్పారు. ప్రపంచంలో ఇతరులు ఎలా జీవిస్తున్నారో, పాకిస్తాన్ లో మైనారిటీలు కూడా అదే విధంగా జీవిస్తున్నారని వివరించారు.