ప్రేమించి మోసం చేసిన అమ్మాయి.. న్యాయం చేయాలంటూ ఆమె ఇంటి ముందు అబ్బాయి ధర్నా!
- నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్‌లో ఘటన
- కన్నీరు పెట్టుకున్న ప్రియుడు
- తనతో అమ్మాయి ఫొటోలు కూడా దిగిందన్న యువకుడు
తన ప్రియురాలు తనతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిందని, చివరికి మొహం చాటేసిందని చెబుతూ ఆమెతో గతంలో దిగిన ఫొటోలను చూపిస్తూ కన్నీరు పెట్టుకున్నాడు. తనకు ఎలాగైనా న్యాయం చేయాలని కోరాడు. ఈ నేపథ్యంలో అతడి ప్రియురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధర్నాకు దిగిన ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.