టీటీడీ బోర్డు మాజీ మెంబర్ శేఖర్ రెడ్డి నిర్దోషి... సీబీఐ కేసులన్నిటినీ కొట్టేసిన మద్రాసు హైకోర్టు

  • శేఖర్ రెడ్డిపై రెండు కేసులు పెట్టిన సీబీఐ
  • 2016లో ఆయన ఇంటి నుంచి రూ. 34 కోట్లు స్వాధీనం
  • సరైన సాక్ష్యాలు లేవన్న మద్రాసు హైకోర్టు
టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, అక్రమాస్తులను కూడబెట్టారని, పలువురు ప్రముఖులకు బినామీగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొన్న ప్రముఖ మైనింగ్ వ్యాపారవేత్త జె.శేఖర్ రెడ్డికి క్లీన్ చిట్ లభించింది. ఆయనపై సీబీఐ నమోదు చేసిన కేసులన్నిటినీ కొట్టి వేస్తున్నట్టు మద్రాస్ హైకోర్టు కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. శేఖర్ రెడ్డితో పాటు కేసులను ఎదుర్కొన్న మరో నలుగురిపై ఉన్న ఆరోపణలనూ తొలగించింది.

2016లో ఆయన నివాసం, కార్యాలయంలో రూ. 34 కోట్లను ఆదాయపు పన్ను శాఖ, సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. శేఖర్ రెడ్డిపై రెండు కేసులను సీబీఐ నమోదు చేయగా, వాటిని విచారించిన న్యాయస్థానం, నిందితులు దోషులని పేర్కొనడానికి సరైన సాక్ష్యాలు లేవని అభిప్రాయపడింది.
Go Back to Shorts
Madras
High Court
Sekhar Reddy
CBI
TTD

More Telugu News