జూలై మొదటి వారంలో శామ్ సంగ్ ‘గెలాక్సీ ఆన్’ ఇన్ఫినిటీ డిస్ ప్లే ఫోన్ ఆవిష్కరణ

  • ఆన్ లైన్ ఎక్స్ క్లూజివ్ మోడల్
  • 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ
  • అమోలెడ్ డిస్ ప్లే, ఎక్సినోస్ ప్రాసెసర్
శామ్ సంగ్ బడ్జెట్ ధరలో మరో ఇన్ఫినిటీ డిస్ ప్లే మొబైల్ ను తీసుకురానుంది. జూలై మొదటి వారంలో గెలాక్సీ ఆన్ ఫోన్ ను  విడుదల చేయనుంది. ఇది ఆన్ లైన్ లో మాత్రమే విక్రయించే మోడల్. ఇన్ఫినిటీ డిస్ ప్లేతో కూడిన గెలాక్సీ జే6, జే8 ఏ6, ఏ6ప్లస్ మోడళ్లను శామ్ సంగ్ ఇటీవలే విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటి ధరలు రూ.14,000-23,000 మధ్య ఉన్నాయి. వీటికి మంచి స్పందన రావడంతో ఇన్ఫినిటీ డిస్ ప్లేతో గెలాక్సీ ఆన్ ను తీసుకువస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. గెలాక్సీ ఆన్ మోడల్ లో అమోలెడ్ డిస్ ప్లే, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ ఉంటాయి. శామ్ సంగ్ ఎక్సినోస్ ప్రాసెసర్ నే ఇందులోనూ ఏర్పాటు చేశారు. 
Go Back to Shorts
samsung
galaxy on
infinity display

More Telugu News