క్లాస్ రూమ్ లో జోక్స్ బాగా వేసేవాడిని: హైపర్ ఆది
- మొదటి నుంచి కామెడీ సెన్స్ ఎక్కువే
- ఎదుటివారిపై పంచ్ లు వేసేవాడిని
- క్లాస్ అయ్యేంతవరకూ నిలబడ్డాను
క్లాస్ రూమ్ లో ఒక వైపున లెక్చరర్ పాఠం చెబుతూ ఉంటే .. మరో వైపున నేను నా ఫ్రెండ్స్ తో జోకులు వేసేవాడిని. ఒకసారి క్లాస్ రూమ్ లో తిరుగుతోన్న సీలింగ్ ఫ్యాన్ ను చూపిస్తూ .. 'ఆ ఫ్యాన్ ను ఒకే ఒక్క వేలుతో ఆపేస్తాను తెలుసా?' అన్నాను. వాళ్లంతా 'ఎలా?' అంటూ ఆశ్చర్యంగా అడిగారు. 'స్విచ్ ఆఫ్ చేసి' అన్నాను. అంతే .. వాళ్లంతా ఒక్కసారిగా పగలబడి నవ్వారు. పాఠం చెబుతోన్న లెక్చరర్ ఆ క్లాస్ అయ్యేంతవరకూ నన్ను నిలబెట్టాడు. ఆ రోజే కాదు .. క్లాస్ జరుగుతుండగా ఎప్పుడు ఎవరు మాట్లాడినా ఆయన నన్నే నిలబెట్టేవారు" అంటూ చెప్పుకొచ్చాడు.