అప్పుడు చిరంజీవి సినిమాను తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు: అల్లు అరవింద్

  • నాటి ‘విజేత’ బిగ్ హిట్
  • కల్యాణ్ దేవ్ తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంటాడు
  • సాయి కొర్రపాటి లాంటి వాళ్లు ఇండస్ట్రీకి చాలా అవసరం
యాక్షన్ సినిమాలతో అప్పట్లో చిరంజీవి బిజీగా ఉన్న వేళ చేసిన ‘విజేత’ సినిమాను తీసుకునేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ ముందుకు రాలేదని నిర్మాత అల్లు అరవింద్ గుర్తు చేసుకున్నారు. ఫ్యామిలీ డ్రామా అని దానిని తీసుకునేందుకు అందరూ ఆలోచించారని, అయితే, ఆ సినిమా బిగ్ హిట్ అయిందని అన్నారు.  సినిమాకు ముందు అసలు ఈ సినిమా ఎందుకు తీయాలని జంద్యాల గారిని కూడా అడిగానని అరవింద్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు అదే టైటిల్‌తో కల్యాణ్ దేవ్ సినిమా చేయడం సంతోషంగా ఉందన్నారు. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించే నిర్మాత సాయి కొర్రపాటి లాంటి వారు చిత్ర పరిశ్రమకు ఎంతో అవసరమని అన్నారు. కల్యాణ్ దేవ్ తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంటూ ముందుకు సాగుతాడని ఆశిస్తున్నట్టు అరవింద్ పేర్కొన్నారు.

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు అయిన కల్యాణ్ దేవ్ ‘విజేత’తో హీరోగా పరిచయం అవుతున్నాడు. ‘లైటింగ్ ఆఫ్ స్మైల్స్ ఆన్ అదర్స్ ఫేసెస్ ఈజ్ ఆల్సో ఎ సక్సెస్’ అనేది ట్యాగ్ లైన్. సాయి కొర్రపాటి వారాహి సంస్థలో  ర‌జినీ కొర్రపాటి నిర్మాత‌గా వ్యవహరిస్తున్న  ఈ సినిమాకు రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్నాడు.
Go Back to Shorts
Megastar
Chiranjeevi
kalyan dev
Tollywood

More Telugu News