chiranjeevi: 'సైరా'మూవీలో హ్యూమా ఖురేషి?

షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్ సినిమాల్లో బిజీ అవుతోన్న హ్యూమా ఖురేషి .. ఇటీవల 'కాలా' సినిమాలో రజనీతో కలిసి నటించింది. ఈ సినిమా తెలుగులో విడుదల కావడం వలన, తమిళంతో పాటు తెలుగులోను మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. నటనపరంగా .. గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఫలితంగా తెలుగు దర్శక నిర్మాతల దృష్టి హ్యూమా ఖురేషిపై పడింది. తమ సినిమాల్లో ఆమెను తీసుకోవడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు.

ఈ నేపథ్యంలోనే 'సైరా' టీమ్ .. ఒక కీలకమైన పాత్ర కోసం హ్యూమా ఖురేషిని సంప్రదించడం .. ఆమె అంగీకరించడం జరిగిపోయాయని అంటున్నారు. నరసింహారెడ్డి మొదటి భార్య పాత్రలో నయనతార నటిస్తుండగా .. మరో భార్య పాత్ర కోసం హ్యుమా ఖురేషీని తీసుకున్నట్టుగా చెబుతున్నారు. త్వరలోనే ఆమె షూటింగులో జాయిన్ కానుందని అంటున్నారు. మరో కీలకమైన పాత్రలో తమన్నా నటిస్తోన్న సంగతి తెలిసిందే. వచ్చే వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.    
Go Back to Shorts
chiranjeevi
nayanatara

More Telugu News