అనూహ్య వ్యాఖ్యలు... ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో గాలికి సీఎం రమేష్ మద్దతు!
- తొలుత సీబీఐ కేసుల నుంచి బయటపడాలి
- ఆపై ఫ్యాక్టరీ కడితే అభ్యంతరం లేదు
- కావాలనే ఆరోపణలు చేస్తున్న పవన్ కల్యాణ్
- పవన్ తన వ్యాఖ్యలను నిరూపిస్తే రాజీనామా: సీఎం రమేష్
ప్రజల నుంచి మద్దతు వస్తుందన్న అసూయతోనే పవన్ కల్యాణ్ ఆరోపణలు చేస్తున్నారని సీఎం రమేష్ విమర్శించారు. తప్పుడు ఆరోపణలు చేయడం ఆయనకు తగదని, తమ దీక్షకు మద్దతివ్వకుండా ఆరోపణలు ఏంటని ప్రశ్నించారు. జిందాల్ ను పవన్ ఎప్పుడు కలిశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన చెప్పిన విషయాలను అప్పుడే ఎందుకు బహిర్గతం చేయలేదని నిలదీసిన సీఎం రమేష్, జిందాల్ లండన్ లో ఉండటం లేదని, ఇండియాలోనే ఉంటున్నారని, ఆ విషయం కూడా తెలియని పవన్, ఆయన పేరిట తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారని అన్నారు. స్టీల్ ఫ్యాక్టరీని టీడీపీ నేతలు అడ్డుకున్నారని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.