ఐదో రోజుకు చేరిన దీక్ష... క్షీణిస్తున్న సీఎం రమేష్ ఆరోగ్యం!
- స్టీల్ ప్లాంట్ ను డిమాండ్ చేస్తున్న సీఎం రమేష్
- ఆయనతో పాటు దీక్షలో ఎమ్మెల్సీ బీటెక్ రవి
- ఇద్దరూ నీరసంగా ఉన్నారన్న వైద్యులు
కాగా, రమేష్ దీక్షకు మద్దతిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ ఉదయం ఎమ్మెల్యేలు బొండా ఉమ, ప్రభాకర్ చౌదరి, సాయినాథ్ గౌడ్ తదితరులు కడపకు వచ్చి రమేష్, రవిలను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను వాకబు చేశారు. పలు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నేతలు దీక్షాస్థలికి వచ్చి రమేష్ ను పరామర్శించారు.