రేపు విజయవాడ దుర్గ గుడిలో సామూహిక అక్షరాభ్యాసాలు!
- రేపు అమ్మవారి జన్మ నక్షత్రం మూల
- ఉదయం పది గంటలకు అక్షరాభ్యాస కార్యక్రమం
- ఈ అవకాశాన్ని చిన్నారుల తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలి: ఈవో పద్మ
చిన్నారులకు అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించదలచుకున్న తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారి పేర్లను www. kanakadurgamma.org వెబ్ సైట్ లో లేదా ఆలయ ప్రాంగణంలోని కార్యాలయంలో నమోదు చేసుకోవాలని తెలిపారు. అక్షరాభ్యాస కార్యక్రమానికి అవసరమైన సామాగ్రిని దేవస్థానం తరపున ఉచితంగా అందిస్తున్నట్టు చెప్పారు.