ప్రాజెక్టు ఖర్చులు పెరిగాయి.. నిర్మాణ అంచనాలను సవరించండి!: నితిన్ గడ్కరీకి దేవినేని ఉమ లేఖ
- పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వివరిస్తూ లేఖ
- పోలవరం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి
- ప్రాజెక్టు నిర్మాణ అంచనాలను సవరించాలి
- రూ.10 వేల కోట్లు విడుదల చేయాలి
సవరించిన అంచనాలను పరిగణనలోకి తీసుకుని రూ.10 వేల కోట్లు విడుదల చేయాలని సదరు కేంద్ర మంత్రిని దేవినేని ఉమా మహేశ్వరరావు కోరారు. పోలవరం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు చాలా ముఖ్యమని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవుతుందని లేఖలో పేర్కొన్నారు.