gold: కాస్త తగ్గిన బంగారం ధర

షార్ట్స్‌లో చూడండి
బులియన్‌ మార్కెట్‌లో ఈరోజు బంగారం ధరలు కాసింత తగ్గాయి. ఈరోజు పది గ్రాముల పసిడిధర రూ.185 తగ్గి రూ.31,715గా నమోదయింది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల దగ్గర నుంచి డిమాండ్‌ లేకపోవడంతో పసిడి ధర తగ్గినట్లు విశ్లేషకులు వివరించారు.

 అలాగే గ్లోబల్‌ మార్కెట్‌లో బంగారం ధర 0.11శాతం తగ్గి  ఔన్సు 1,273.21 డాలర్లుగా నమోదయింది. కాగా వెండి ధరలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. కిలో వెండి ధర రూ.41,000గా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ సాధారణంగా ఉంది.                 
Go Back to Shorts
gold
silver
rates

More Telugu News