నితిన్ నుంచి మరో లవ్ స్టోరీ .. టైటిల్ గా 'భీష్మ'
- వెంకీ కుడుముల దర్శకత్వంలో లవ్ స్టోరీ
- కథానాయకుడిగా నితిన్
- ఈ సినిమాపైనే ఆయన ఆశలు
'ఛలో' సినిమాతో వెంకీ కుడుముల దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేశాడు. ప్రేమకథను ఆయన కొత్తగా చెప్పిన తీరు యూత్ ను బాగా ఆకట్టుకుంది. నితిన్ తో చేసేది కూడా లవ్ స్టోరీనే కావడం వలన అందరిలో ఆసక్తి పెరుగుతోంది. వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న నితిన్, ఈ సినిమాతో తాను ఆశిస్తోన్న హిట్ దొరుకుతుందనే నమ్మకంతో వున్నాడు. ఈ సినిమాతో ఆయన నిరీక్షణ ఫలిస్తుందేమో చూడాలి.