purandeswari: బీజేపీలో పురందేశ్వరి మాత్రమే ఉంది.. నేను లేను: దగ్గుబాటి వెంకటేశ్వరరావు

  • 2014లోనే రాజకీయాలను వదిలేశా
  • రాజకీయాలపై ఆసక్తి లేదు
  • తెలంగాణ పోరాటంపై పుస్తకం రాశా
తన భార్య పురందేశ్వరి మాత్రమే బీజేపీలో ఉన్నారని... తాను ఆ పార్టీలో లేనని దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలిపారు. 2014లోనే తాను రాజకీయాల నుంచి తప్పుకున్నానని... తనకు ఇప్పుడు రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్పారు. ఈ కాలంలో తెలంగాణ పోరాటంపై ఓ పుస్తకం రాశానని తెలిపారు. గతంలో రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల ఎంతో మందిని కలవలేక పోయానని... ఇప్పుడు అందరినీ కలుస్తున్నానని చెప్పారు. ఇప్పుడు తనకు నచ్చిన విధంగా జీవితాన్ని గడుపుతున్నానని, చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు.
purandeswari
daggubati venkateswara rao
politics

More Telugu News