KCR: చంద్రబాబు, కేసీఆర్ కలయికపై టీజీ వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • ఇద్దరూ కలిస్తే ఏపీకి ఎంతో మేలు
  • విభజన సమస్యలకు పరిష్కారం కూడా
  • మోదీ వలలో కేసీఆర్ పడరాదు 
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు కలిస్తే రెండు తెలుగు రాష్ట్రాలకూ ఎంతో మేలు జరుగుతుందని తెలుగుదేశం ఎంపీ టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు కేసీఆర్ మద్దతు పలకాలని సూచించిన ఆయన, అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన తరువాత ఏర్పడిన సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, ఏపీకి సపోర్ట్ గా కేసీఆర్ నిలవాలని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వలలో కేసీఆర్ పడరాదని సూచించిన ఆయన, బీజేపీ పతనం ఇప్పటికే ప్రారంభమైందని అభిప్రాయపడ్డారు.
KCR
Chandrababu
Andhra Pradesh
Telangana
TG Venkatesh

More Telugu News