ఎంతో భావోద్వేగానికి గురి చేస్తున్న ఫొటో ఇది!
- సరిహద్దులు దాటుతున్న మెక్సికన్లను అడ్డుకుంటున్న అమెరికా
- తల్లిదండ్రుల నుంచి పిల్లలను బలవంతంగా వేరు చేస్తున్న వైనం
- హోండురస్ కు చెందిన రెండేళ్ల బాలిక ఏడుస్తున్న ఫొటో వైరల్
కాగా, అమెరికా- మెక్సికో సరిహద్దు విషయంలో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన వైఖరికి ఈ ఫొటోనే నిదర్శనమంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ విధంగా ఇప్పటికే రెండు వేల మంది పిల్లలు తమ తల్లిదండ్రులకు దూరమయ్యారు. అమెరికాలోని దక్షిణ సరిహద్దులో అక్రమ వలసలను అడ్డుకునే క్రమంలో చిన్నారులను తల్లిదండ్రుల నుంచి దూరం చేస్తుండడంపై తీవ్రమైన విమర్శలు తలెత్తుతున్నాయి.
ఇదిలా ఉండగా, ఈ ఫొటోను తీసింది గెట్టీ ఫొటో గ్రాఫర్, పులిట్జర్ అవార్డు గ్రహీత జాన్ మూర్. ఆ చిన్నారి ఏడుస్తున్న సమయంలో ఆమె తల్లిని పోలీసులు విచారిస్తున్నారు. ఇక్కడ తీసిన ఫొటోలపై జాన్ మూర్ స్పందిస్తూ.. తాను ఎంతో భావోద్వేగానికి గురయ్యానని అన్నారు.