అందుకే చిరంజీవి మరింత బరువు పెరిగారట!

  • 'సైరా' షూటింగులో చిరంజీవి 
  • కోకాపేట్ లో ప్రత్యేకమైన సెట్ 
  • నెల రోజుల పాటు జరగనున్న షూటింగ్
ఈ మధ్య కాలంలో చిరంజీవిని చూసినవారు .. ఆయన మరింత బరువు పెరగడం గమనించారు. ఎప్పుడూ ఎంతో ఫిట్ గా కనిపించే చిరంజీవి ఇలా ఎందుకు లావయ్యారనే విషయాన్ని గురించే మాట్లాడుకున్నారు. అయితే ఆయనలా బరువు పెరిగింది 'సైరా' సినిమా కోసమేనట. ఈ సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఆయన మరింత వయసు మళ్లినవాడిగా కనిపించే సన్నివేశాలు వున్నాయట. అందుకోసమే ఆయన అలా కనిపిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారు 'కోకాపేట'లో వేసిన ప్రత్యేకమైన సెట్లో జరుగుతోంది. చిరంజీవితో పాటు విజయ్ సేతుపతి .. తమన్నా కూడా ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. దాదాపు నెల రోజుల పాటు ఇక్కడ కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు సమాచారం. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22వ తేదీన ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నట్టు చెబుతున్నారు. 
Go Back to Shorts
chiranjeevi
nayanatara

More Telugu News