YSRCP: వైసీపీ నేతలు వంకర మాటలు మాట్లాడటం సిగ్గుచేటు: టీడీపీ నేతల మండిపాటు

షార్ట్స్‌లో చూడండి
ఢిల్లీలో నిన్న జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కరచాలనం చేయడంపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను టీడీపీ నేత వర్ల రామయ్య తిప్పికొట్టారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధానితో చేయి కలిపితే వంకర మాటలు మాట్లాడటం సిగ్గుచేటని, వైసీపీ నేతలు నీచమైన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నడిపిస్తున్నారని విమర్శించారు. 

కాగా, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మాట్లాడుతూ, నీతి ఆయోగ్ సమావేశంలో కేంద్రం తీరును చంద్రబాబు ఎండగట్టారని అన్నారు. చంద్రబాబు చేసిన ప్రసంగం ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల మద్దతు కూడగట్టేలా చేసిందని చెప్పారు. సభ్యత, సంస్కారం, విజ్ఞత లేని వ్యక్తి జీవీఎల్ నరసింహారావు అని మండిపడ్డారు. ప్రధాని పలకరింపునకు సంస్కారంగా మాత్రమే చంద్రబాబు వ్యవహరించారని అన్నారు. 
Go Back to Shorts
YSRCP
varla ramaiah

More Telugu News