ధర్నా చేసేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రికి ఎవరు అనుమతిచ్చారు?: ప్రశ్నించిన హైకోర్టు
- ఒకరి కార్యాలయంలోకి వెళ్లి దీక్ష చేయడం కుదరదు
- పిటిషన్ పై విచారణలో భాగంగా ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్య
- మంత్రి సత్యేందర్ జైన్ ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలింపు
‘‘మీరు ధర్నాలో కూర్చున్నారు. ఈ విధంగా దర్నా చేసేందుకు ఎవరు అనుమతించారు? దీన్ని దీక్ష అనరు. ఒకరి కార్యాలయం లేదా నివాసంలోకి వెళ్లి ధర్నా చేయడం కుదరదు’’ అని కోర్టు పేర్కొంది. మరోవైపు కేజ్రీవాల్ వెంట కూర్చున్న మంత్రుల్లో సత్యేంద్ర జైన్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా రెండో రోజు నుంచి నిరాహార దీక్షచేపట్టగా, సత్యేంద్ర జైన్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో పోలీసులు ఆయన్ను ఎల్ఎన్ జేపీ ఆస్పత్రికి తరలించారు.