మమతా బెనర్జీ, పినరయి విజయన్‌, కేజ్రీవాల్‌, కుమారస్వామిలతో మాట్లాడిన చంద్రబాబు

మమతా బెనర్జీ, పినరయి విజయన్‌, కేజ్రీవాల్‌, కుమారస్వామిలతో మాట్లాడిన చంద్రబాబు

  • ఈనెల 17న నీతి ఆయోగ్ సమావేశం
  • పాల్గొననున్న ముఖ్యమంత్రులు
  • ఆ సమావేశానికి వెళ్లి తమ వాదనలు వినిపించనున్న సీఎంలు
  • బాయ్‌కాట్‌ చేసే అంశంపై కూడా చర్చ
ఈరోజు అమరావతిలో టీడీపీ ఎంపీలతో భేటీ అయిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇందులో ప్రధానంగా ఈనెల 17న జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంపై చర్చించారు. ఈ సందర్భంగా తమ ఎంపీలతో మాట్లాడుతూ బీజేపీయేతర సీఎంలతో తాను సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే తాను పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరయి విజయన్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, కర్ణాటక సీఎం కుమారస్వామిలతో మాట్లాడినట్లు చెప్పారు.

నీతి ఆయోగ్‌ సమావేశంలో ఏయే అంశాలను ప్రస్తావించాలనే అంశంపై చర్చించినట్లు చంద్రబాబు వివరించారు. ఆ సమావేశానికి వెళ్లి ఎవరి వాదన వారు వినిపించాలని, అనంతరం సమావేశాన్ని బాయ్‌కాట్‌ చేసే అంశంపైనా చర్చించినట్లు వెల్లడించారు. మరికొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. 
mamatha
Arvind Kejriwal
Chandrababu

More Telugu News