మోత్కుపల్లి నర్సింహులుతో విజయసాయి రెడ్డి భేటీ

  • హైదరాబాద్ లోని మోత్కుపల్లి నివాసానికి వెళ్లిన విజయసాయి
  • పలు విషయాలపై వారు చర్చించుకున్నట్టు సమాచారం
  • మోత్కుపల్లి తిరుమల యాత్రకు వైసీపీ మద్దతు?
టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులుతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈరోజు భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని మోత్కుపల్లి నివాసానికి ఈరోజు విజయసాయిరెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా పలు విషయాలపై వారు చర్చించుకున్నట్టు సమాచారం. మోత్కుపల్లి తిరుమల యాత్రకు వైసీపీ మద్దతు ప్రకటించినట్టు సమాచారం.

కాగా, మూడు రోజుల క్రితమే మోత్కుపల్లిని విజయసాయి కలవాలనుకున్న విషయం తెలిసిందే. అయితే, మీడియా కంట పడటంతో మోత్కుపల్లిని కలవకుండానే విజయసాయి వెనుదిరిగారు. ఆ తర్వాత ఇదే విషయమై విజయసాయిని మీడియా ప్రశ్నించగా.. మోత్కుపల్లిని కలవాలని తాను అనుకోలేదని, కలిసేందుకు వెళ్లాననే ప్రచారం చేశారు కనుక కచ్చితంగా మోత్కుపల్లిని కలుస్తానంటూ విజయసాయిరెడ్డి చెప్పుకున్నారు.
Go Back to Shorts
mothkpalli
vijaya sai reddy

More Telugu News