నీతి ఆయోగ్ సమావేశంలో కేంద్రాన్ని ఎండగట్టేందుకు సిద్ధమవుతున్న చంద్రబాబు
- నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై సమీక్ష
- రాష్ట్ర అభివృద్ధిని కేంద్రం అడ్డుకోవడం సరికాదన్న సీఎం
- పోలవరం విషయంలో వాదనలు గట్టిగా వినిపిద్దాం
నిధుల కోసం ఇబ్బందులు పడుతున్నా పోలవరం ప్రాజెక్టుకు ఖర్చు చేస్తున్నామని... డయాఫ్రం వాల్ ను విజయవంతంగా పూర్తి చేశామని చంద్రబాబు తెలిపారు. పోలవరం విషయంలో మన వాదనలను గట్టిగా వినిపించాల్సిన అవసరం ఉందని అన్నారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత కూడా నిధుల విడుదలలో ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు. లెక్కలు లేవంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రత్యేక హోదా కోసం గట్టిగా పట్టుబడదామని చెప్పారు.