KCR: రేపు ఢిల్లీకి తెలంగాణ సీఎం కేసీఆర్

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. తన పర్యటనలో భాగంగా ఎల్లుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అవుతారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయన మోదీతో చర్చిస్తారు. తన పర్యటనలో భాగంగా కేసీఆర్‌.. పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆయన వారితో చర్చలు జరపనున్నారు. ఆయన ఢిల్లీలో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నట్లు సమాచారం. గత నెలలోనూ కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. అప్పట్లో మోదీతో భేటీ కావాలనుకున్న కేసీఆర్‌ పలు కారణాలతో చర్చించలేకపోయారు. కాగా, సీఎం కేసీఆర్‌ కొద్ది సేపటి క్రితం గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి చర్చించారు. 
Go Back to Shorts
KCR
Narendra Modi
TRS

More Telugu News