ఆ ముగ్గురు విద్యార్థులకు అండగా ఉంటానన్న చంద్రబాబు

  • ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం సందర్భంగా జెండాలు కడుతూ కరెంట్ షాక్ కు గురైన విద్యార్థులు
  • పార్టీ ఖర్చులతో వైద్యం
  • ఉద్యోగావకాశాలు కల్పించాలంటూ చంద్రబాబు ఆదేశం
ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం సందర్భంగా గుంటూరు జిల్లా తాడికొండ మండలం గరికపాడుకు చెందిన ముగ్గురు విద్యార్థులు పార్టీ జెండా కడుతూ విద్యుత్ షాక్ కు గురైన సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడ్డ వారికి పార్టీ ఖర్చులతో వైద్యం అందించారు. ప్రస్తుతం వారు కోలుకున్నారు. ఈ నేపథ్యంలో, విద్యార్థులు, వారి కుటుంబసభ్యులు ఈ ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిందిగా సీఎం పేషీ అధికారులను ఆదేశించారు. చంద్రబాబు సాయంపై విద్యార్థులు, వారి కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. 
Go Back to Shorts
Chandrababu
students
help
intintiki Telugudesam

More Telugu News