Rajinikanth: 'కాలా' సినిమా చూశా.. బాగుంది!: గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవానీ

షార్ట్స్‌లో చూడండి
సౌతిండియా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, పా.రంజిత్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న 'కాలా' సినిమా ఈ నెల 7న విడుదలైన విషయం తెలిసిందే. ఆ సినిమాకు దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. వెనకబడిన ప్రాంత ప్రజల కష్టాలను తెలిపే ఈ సినిమాపై గుజరాత్‌ కు చెందిన దళిత ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవాని ప్రశంసలు కురిపించారు.

తాజాగా, ఆయన ట్విట్టర్‌లో ఈ సినిమా గురించి స్పందిస్తూ... 'నిన్న కాలా సినిమా చూశాను. నేను కూడా 'కాలా'లా ఫీలయ్యాను. చాలా మంచి సినిమా. పా.రంజిత్‌ మరో ఛాలెంజింగ్‌ సినిమాను తీశారు. ఆయనను చూస్తోంటే గర్వంగా ఉంది' అని అన్నారు. గతంలో దర్శకుడు రంజిత్ తో కలసి దిగిన ఫొటోను కూడా ఆయన పోస్ట్ చేశారు.
Go Back to Shorts
Rajinikanth
kaala

More Telugu News