kalyan dev: 'విజేత' ఫస్టు టీజర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు

షార్ట్స్‌లో చూడండి
చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా 'విజేత' సినిమా నిర్మతమైంది. సాయి కొర్రపాటి నిర్మాణంలో .. రాకేశ్ శశి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. మాళవిక నాయర్ కథానాయికగా నటించిన ఈ సినిమా నుంచి ఇటీవలే ఫస్టులుక్ వదిలారు. కల్యాణ్ దేవ్ లుక్ పట్ల అందరూ సంతృప్తిని వ్యక్తం చేశారు.

ఇక ఆయన నటన ఎలా వుండనుందనే విషయం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఫస్టు టీజర్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి రేపు ఉదయం 8 గంటల 59 నిమిషాలకి టీజర్ ను విడుదల చేయనున్నారు. జూలైలో ఈ సినిమా అత్యధిక థియేటర్లలో విడుదల కానుంది. మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తుండటంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి వుంది. లుక్స్ పరంగా ఓకే అనిపించుకున్న కల్యాణ్ దేవ్ .. టీజర్ తో ఎన్ని మార్కులు కొట్టేస్తాడో చూడాలి.      
Go Back to Shorts
kalyan dev
malavika nair

More Telugu News