చైనాలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సినిమా 11,500 థియేటర్లలో విడుదల.. భారీ వసూళ్లు
- రెండు రోజుల్లోనే రూ.39.85 కోట్లు
- టాయిలెట్ హీరో పేరుతో విడుదల
- ప్రతిరోజు 56,000 షోలు
రెండు రోజుల్లోనే చైనాలో ఏక్ థా ప్రేమ్ కథ రూ.39.85 కోట్లు రాబట్టింది. ఈ సినిమాను చైనాలో 'టాయిలెట్ హీరో' పేరుతో విడుదల చేశారు. ఎంటర్‌టైన్‌మెంట్‌కి సందేశాత్మక అంశాలు జోడించి ఈ సినిమాను రూపొందించారు. పారిశుద్ధ్యత పెంపొందించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు మద్దతుగా అక్షయ్ కుమార్ ఈ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయన సరసన భుమి పెడ్నేకర్ నటించారు.