petrol: స్వల్పంగా తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా తొమ్మిదవ రోజు తగ్గాయి. ఈరోజు పెట్రోలు ధర 9 పైసలు తగ్గగా, డీజిల్‌ ధర 7 పైసలు తగ్గింది. ఉదయం 6 గంటల నుంచి తగ్గింపు అమల్లోకి వచ్చిందని ఈ మేరకు ఆయిల్‌ కంపెనీలు ప్రకటన చేశాయి. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా రూ. 77.63, రూ. 68.73గా ఉండగా ముంబయిలో రూ. 85.45, రూ. 73.17గా ఉన్నాయి. కోల్‌కతా, చెన్నయ్‌లో పెట్రోల్‌ ధరలు రూ. 80.28, రూ. 80.59గా ఉండగా, డీజిల్‌ ధరలు రూ. 71.28, రూ. 72.56గా ఉన్నాయి. గత నెలలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా పెరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే. కాగా, హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.82.23గా ఉండగా, డీజిల్‌ ధర రూ.74.71గా ఉంది.
    
petrol
diesel

More Telugu News