sensex: వరుసగా రెండో రోజు బేర్ మన్న మార్కెట్లు

షార్ట్స్‌లో చూడండి
ఆర్బీఐ మానిటరీ పాలసీ ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తుండటంతో భారతీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాలను నమోదు చేశాయి. ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు క్రమంగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 109 పాయింట్లు నష్టపోయి 34,903 కు పడిపోయింది. నిఫ్టీ 35 పాయింట్లు కోల్పోయి 10,593 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
లక్ష్మీవిలాస్ బ్యాంక్ (4.91%), సిప్లా (3.97%), ఇంటలెక్ట్ డిజైన్ ఎరీనా లిమిటెడ్ (3.45%), హ్యాథ్ వే కేబుల్ అండ్ డేటా (3.15%), బలరాంపూర్ చీనీ మిల్స్ (3.14%).  

టాప్ లూజర్స్:
హెచ్డీఐఎల్ (-11.09%), ఐడియా సెల్యులార్ (-9.96%), అవంతి ఫీడ్స్ లిమిటెడ్ (-9.12%), రిలయన్స్ కమ్యూనికేషన్స్ (-7.94%).   
Go Back to Shorts
sensex
nifty
stock market

More Telugu News