ఉస్మానియాలో అగ్ని ప్రమాదం... జవాబు పత్రాలు దగ్ధం!
- మానేరు హాస్టల్ వెనుకవైపు మూల్యాంకనం గది
- పేపర్ స్టోర్ రూమ్ దగ్ధం
- విద్యార్థుల్లో ఆందోళన
విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా, ఫలితం లేకపోయింది. ఆన్సర్ షీట్స్ మొత్తం తగులబడి బూడిద కుప్పగా మారాయి. అయితే, ఏఏ పరీక్షల జవాబు పత్రాలు దగ్ధమయ్యాయన్న విషయం ఇంకా తెలియరాలేదు. ఈ వార్తతో పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.