నాపై చేస్తోన్న ఆరోపణలను పవన్ కల్యాణ్‌ నిరూపించాలి: నారా లోకేశ్
Add ap7am to your home Screen

నాపై చేస్తోన్న ఆరోపణలను పవన్ కల్యాణ్‌ నిరూపించాలి: నారా లోకేశ్

  • నిరాధార ఆరోపణలు మానేయాలి
  • ప్రతిపక్ష నేతలు మోదీని విమర్శించట్లేదు
  • చివరి బడ్జెట్‌లో కూడా ఏపీని కేంద్ర ప్రభుత్వం మోసం చేసింది
  • ప్రతిపక్ష నాయకులకు ధైర్యం ఉంటే మోదీని నిలదీయాలి
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, ఇక అవి మాని సాక్ష్యాధారాలతో రావాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ఈరోజు ఆయన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెంలో మాట్లాడుతూ... ప్రతిపక్ష నేతలు పాదయాత్రలు, పోరాట యాత్రల పేరుతో చంద్రబాబును విమర్శించే కార్యక్రమం పెట్టుకున్నారని అన్నారు. నిరంతరం ఏపీ ప్రజల కోసం పనిచేస్తోన్న నాయకుడు చంద్రబాబు అని, అటువంటి నాయకుడిపై విమర్శలు చేస్తున్నారని అన్నారు.

ఇన్ని రోజుల్లో ఒక్కరోజైనా ప్రధాని మోదీని వీళ్లు విమర్శించారా? అని లోకేశ్‌ ప్రశ్నించారు. ప్రత్యేక హోదాతో పాటు 18 అంశాలపై ఇచ్చిన హామీలను ఆయన గాలికి వదిలేశారని అన్నారు. చివరి బడ్జెట్‌లో కూడా ఏపీని కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని, ప్రతిపక్ష నాయకులకు ధైర్యం ఉంటే మోదీని నిలదీయాలని అన్నారు.      
Nara Lokesh
Pawan Kalyan
Jana Sena

More Telugu News