ఈనెల 6న కర్ణాటక రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ!
- గవర్నర్‌ను కలిసిన సీఎం, డిప్యూటీ సీఎం
- మంత్రివర్గ కూర్పు విషయంలో కుదిరిన ఏకాభిప్రాయం
- సంకీర్ణ సర్కారు సజావుగా ముందుకు వెళ్లడమే ముఖ్యమన్న నేతలు
అనంతరం ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర మీడియాతో మాట్లాడుతూ... ఈనెల 6న మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని, ఆ తరువాత సుపరిపాలన కొనసాగించబోతున్నామని చెప్పారు. మంత్రివర్గ కూర్పు విషయంలో తాము కలిసే నిర్ణయం తీసుకున్నామని అన్నారు. రాష్ట్రంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం సజావుగా ముందుకు వెళ్లడమే ముఖ్యమని తెలిపారు.