'విజేత'గా చిరూ చిన్నల్లుడు .. టాకీ పార్ట్ పూర్తి
- 'విజేత'గా కల్యాణ్ దేవ్
- కథానాయికగా మాళవిక నాయర్
- జూలైలో ప్రేక్షకుల ముందుకు
నటనలోను .. డాన్స్ .. ఫైట్స్ లోను కల్యాణ్ ప్రత్యేక శిక్షణ తీసుకుని మరీ రంగంలోకి దిగాడు. గతంలో చిరంజీవి హిట్ కొట్టిన 'విజేత' టైటిల్ ను సెట్ చేసుకుని సగం మార్కులను అక్కడే కొట్టేశాడు. ఈ సినిమా ఫస్టులుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. లుక్ పరంగా యూత్ నుంచి మంచి మార్కులు తెచ్చుకున్న ఈ హీరో, ఇక నటన .. డాన్స్ .. ఫైట్స్ విషయంలో ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి.