gold: పెరిగిన బంగారం ధర.. తగ్గిన వెండి ధర

షార్ట్స్‌లో చూడండి
బులియన్‌ మార్కెట్‌లో ఈరోజు బంగారం ధర పెరిగింది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక బంగారం దుకాణదారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో ఈ రోజు 10 గ్రాముల పసిడి ధర రూ.230 పెరిగి, 32,090గా నమోదయింది. ఇక గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర 0.09 శాతం పెరిగి ఔన్సు 1,298.40 డాలర్లుగా నమోదయింది. మరోవైపు వెండి ధర మాత్రం కాస్త తగ్గింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ లేకపోవడంతో కిలో వెండి ధర రూ.200 పడిపోయి, రూ. 40,700కి చేరింది. కాగా, వరసగా మూడు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వచ్చిన విషయం తెలిసిందే.                  
Go Back to Shorts
gold
silver
rates

More Telugu News