shankar: 'భారతీయుడు 2'కి సంగీత దర్శకుడిగా అనిరుధ్

షార్ట్స్‌లో చూడండి
దర్శకుడు శంకర్ ఒక వైపున '2.ఓ' సినిమాకి సంబంధించిన పనులను పూర్తి చేస్తూనే, మరో వైపున 'భారతీయుడు 2' సినిమాకి రంగాన్ని సిద్ధం చేస్తున్నాడు. గతంలో శంకర్ దర్శకత్వం వహించిన 'భారతీయుడు' సినిమాలో కమల్ ద్విపాత్రాభినయం చేశారు. మనీషా కొయిరాలా .. ఊర్మిళ .. సుకన్య ప్రధానమైన పాత్రలను పోషించారు. దేశభక్తి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది.

 ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి శంకర్ రెడీ అవుతున్నాడు. తాజాగా ఆయన ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా అనిరుధ్ ను తీసుకున్నట్టు సమాచారం. అనిరుధ్ తో సంప్రదింపులు జరపడం.. ఆయన ఓకే చెప్పేయడం జరిగిపోయాయని అంటున్నారు. ప్రస్తుతం కమల్ చేస్తోన్న తమిళంలో 'బిగ్ బాస్' సీజన్ 2 పూర్తికాగానే 'భారతీయుడు 2' సెట్స్ పైకి వెళుతుందని అంటున్నారు. ఇతర నటీనటులు.. సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియను త్వరలోనే మొదలుపెడతారట.  
Go Back to Shorts
shankar
anirudh

More Telugu News